ఆనం రామనారాయణరెడ్డికి బుద్ధి మందగించింది
2 Feb, 2023 11:54 IST
నెల్లూరు: ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వయసు పెరిగే కొద్ది బుద్ధి మందగిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం రామనారాయణరెడ్డి అని విమర్శించారు. వయసు పైబడటంతో ఆనం రామనారాయణరెడ్డికి బుద్ధి మందగించిందని మండిపడ్డారు. వెంకటగిరి నక్సల్ ప్రాంతమని ఆనం మాట్లాడుతున్నారని, ఆనంను సొంత తమ్ముడే వ్యతిరేకిస్తున్నాడని గుర్తు చేశారు. ఏడాదిన్నర నుంచి ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందని ఇప్పుడు అంటున్నారు. ముందునుంచే శ్రీధర్‌రెడ్డి, ఆనంలు టీడీపీతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.