స్పీక‌ర్ ఓం బిర్లాకు  వైయ‌స్ఆర్‌సీపీ అభినందనలు

26 Jun, 2024 17:50 IST


న్యూఢిల్లీ:  లోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైయ‌స్ఆర్‌సీపీ అభినందనలు తెలిపింది. లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..  గడిచిన లోక్‌సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాల‌ని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారు.