సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి
సచివాలయం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ సీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను వైయస్ఆర్ సీపీ నేతలు రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నారాయణమూర్తి కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పలాస, రాజాంలలో టీడీపీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన నిర్వహించిన సభలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలను కూడా ముఖేష్ కుమార్ మీనాకు అందజేశారు.