వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా ఎమ్మెల్యే చంద్రశేఖర్
11 Nov, 2024 19:03 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పలువురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నియామకాలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులును నియమించారు.