ఆ ఉత్తరం నకిలీది
22 Mar, 2022 15:39 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి గారు రాసినట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఉత్తరం నిజం కాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తేల్చి చెప్పింది. ఆ ఉత్తరం నకిలీదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ఉత్తరం భారతి గారు రాసినది కాదు. ఈ విషయం గమనించాల్సిందిగా ప్రకటనలో కోరారు.