బద్వేలు పట్టణంలో వైయస్ఆర్సీపీ నేతల ఇంటింటి ప్రచారం
18 Oct, 2021 18:01 IST
వైయస్ఆర్ జిల్లా: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బద్వేల్ మున్సిపాలిటీలోని 9, 10, 11, 12, 13,14, 15,16, 17, 18వ వార్డుల్లో వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులు అభ్యర్థించారు. ప్రచారంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాఫా, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి , కడప మేయర్ సురేష్ బాబు, సగర్ కార్పొరేషన్ గానుగపెంట రమణమ్మ శీనయ్య, నాయి బ్రాహ్మణ చైర్మన్ యానదయ్య,సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పులి సునిల్, గురుమోహన్, న్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.