గన్నవరంలో వైయస్ జగన్‌కు ఘన స్వాగతం
10 Sep, 2024 20:36 IST
కృష్ణా: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి.
టీడీపీ కూటమి ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టై గుంటూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో రేపు వైయస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఆపై టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ క్రోసూరు వైయస్ఆర్‌సీపీ నేత ఈద సాంబిరెడ్డిని పరామర్శించనున్నారు.