స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
7 Oct, 2025 15:33 IST
నంద్యాల: త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వైయస్ఆర్‌సీపీ బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామాల రిజర్వేషన్ల ఆధారంగా ప్రతి ఒక్కరికి పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గ విభేదాలను వీడి కలిసికట్టుగా పని చేయాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.