బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం వైయస్ జగన్
7 Dec, 2022 10:56 IST
విజయవాడ: బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని వైయస్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. వైయస్ఆర్‌సీపీ ‘జయహో బీసీ మహాసభ’ ప్రారంభోపన్యాసాన్నిఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీసీ స్థితిగతులను మార్చేసిన వ్యక్తి సీఎం వైయస్ జగన్. సంచార జాతులను గుర్తించిన ఏకైక సీఎం కూడా ఈయనే. సీఎం వైయస్ జగన్ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కేబినెట్‌లో పదకొండు మంది బీసీలకు స్థానం కల్పించారు. రాజ్యసభ పదవుల్లో సగం బీసీలకే ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం వైయస్ జగన్ అని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కొనియాడారు.