కార్యకర్తలే వైయ‌స్ఆర్ సీపీకి బలమైన పునాది

4 Mar, 2022 18:44 IST

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాలతో ప్రజలలో ప్రభుత్వం పట్ల మరింత విశ్వాసం పెరిగిందని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అనుబంధ‌ విభాగాల ఇన్‌చార్జ్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజల హృదయాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి కారణం పార్టీ కార్యకర్తల కృషేనన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది కార్యకర్తలేనని, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదనే విషయం అందరూ గుర్తించాలని కోరారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న  సమావేశమయ్యారు. పార్టీ అనుబంధ సంఘాల పనితీరు, జిల్లాల్లో ఆయా శాఖల పనితీరు,  పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు సంబంధించిన పలు అంశాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అనుబంధ విభాగాల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. 

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వైయస్ జగన్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అవినీతికి తావు లేకుండా లబ్దిదారులకు ఆ పథకాలు నేరుగా చేరడం వల్ల,  ప్రభుత్వం పట్ల ప్రజలు అచెంచలమైన విశ్వాసంతో ఉన్నారన్నారు. 2019 ఎన్నికలలో 51 శాతం ఓట్లు వైయస్ఆర్ సీపీకి వచ్చాయని, ముఖ్య‌మంత్రి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం పట్ల ప్ర‌జ‌ల్లో ఆదరణ మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ  పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా..? లేదా..? అనే విషయాలను క్షేత్రస్థాయిలో అనుబంధ విభాగాలు పరిశీలించాలన్నారు. అర్హ‌త ఉండి ప్ర‌భుత్వ సాయం అందని కుటుంబాలు, వ్య‌క్తుల‌ను గుర్తించి ఆయా పథకాలను అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలన్నారు. 

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తగిన గుర్తింపు ఇచ్చారని పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి గుర్తుచేశారు. ఇంకా గ్రామ, మండల, జిల్లా స్ధాయిలలో పనిచేసిన వారిని గుర్తించి ఆయా జాబితాలను తనకు అందిస్తే వారిని కూడా తగిన విధంగా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. బీసీల‌కు సంబంధించి 56 కార్పోరేషన్లను ఏర్పాటుచేయడం ద్వారా, ఆ వర్గాల అభివృధ్దికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతగా కట్టుబడి ఉన్నారో స్పష్టం చేశారని తెలిపారు. అదేవిధంగా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి వారిలో పేదరికం పోగొట్టి, వారిని అభివృద్దిలోకి తీసుకువచ్చే విధంగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. అగ్రవర్ణాలలోని పేదలకు సైతం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.

వైయ‌స్ఆర్ సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఇచ్చిన సూచనలు, సలహాలతో పాటు, వారు చెప్పిన పలు అంశాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతల దృష్ట్యా అంతా టీమ్ స్పిరిట్‌తో పనిచేసి పార్టీని మరింత బలపడేలా చేయాలనేదే తన లక్ష్యమ‌న్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో.. ఈ  ప్రభుత్వం రాష్ట్రంలోని  ప్రజలందరి ఆదరాభిమానాలను చూరగొనడాన్ని చూసి తట్టుకోలేక,  దిక్కుతోచని స్దితిలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు సమర్థ‌వంతంగా తిప్పికొట్టాలని కోరారు. 

ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, అనుబంధ సంఘాల అధ్య‌క్షులు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున (ఎస్సీ సెల్), జంగా కృష్ణమూర్తి (బీసి సెల్), చల్లా మధుసూద‌న్ రెడ్డి (ఐటీ విభాగం), ఎంవీఎస్ నాగిరెడ్డి (రైతు విభాగం), అంకంరెడ్డి నారాయణ మూర్తి (గ్రీవెన్స్ సెల్), పూనూరు గౌతంరెడ్డి (ట్రేడ్ యూనియన్), చిల్లపల్లి మోహన్ రావు (చేనేత విభాగం), మనోహర్ రెడ్డి (లీగల్ సెల్ ), దొంతిరెడ్డి వేమారెడ్డి (పంచాయతీరాజ్ విభాగం), డాక్టర్ శివభరత్ రెడ్డి (డాక్టర్స్ విభాగం), కె.సుధాకర్ రెడ్డి (పోలింగ్ బూత్ విభాగం), ఏ.హర్షవర్ధన్ రెడ్డి (ఎన్. ఆర్. ఐ. విభాగం) తదితరులు హాజరయ్యారు.