పొగాకు రైతుల‌ను ఆదుకోవాలి

23 Apr, 2025 16:23 IST

గుంటూరు: పొగాకు గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నార‌ని, త‌క్ష‌ణ‌మే వారిని ఆదుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులతో పాటు అధికారులను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు  కలిసి వినతి పత్రం అందించారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడారు.` రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు.పొగాకు గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలే శరణ్యమని భావించే పరిస్థితులు వచ్చాయి. పొగాకు, వరి పంట, మిర్చి ఇలా ఏ ఒక్క పంటకు కనీస ధర లేదు. గత కొద్ది రోజుల క్రితం మిర్చి రైతుల గిట్టుబాటు ధర కల్పించాలని మా అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ కి రావటం జరిగింది. రైతుల కోసం వచ్చిన మా నాయకుడు పై అనేక మంది నాయకులపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో అక్రమ కేసులు పెట్టారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పొగాకు కొనకపోతే బోర్డ్ లో డబ్బుకు ఉన్నాయి, బోర్డు కొని అమ్ముకోవాలని డిమాండ్ చేస్తున్నాం` అని మేరుగ నాగార్జున పేర్కొన్నారు.