ప్లీనరీ వేదికకు వైయస్ఆర్ ప్రాంగణంగా నామకరణం
7 Jul, 2022 21:13 IST
గుంటూరు: నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న వైయస్ఆర్ సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాటు చేశారు. ప్లీనరీ వేదికకు వైయస్ఆర్ ప్రాంగణంగా నామకరణం చేసినట్లు ప్లీనరీ కన్వీనర్ తలశీల రఘురామ్ తెలిపారు. ప్లీనరీ ప్రాంగణాన్ని మంత్రులు గురువారం పరిశీలించారు. ఈ రోజు సాయంత్రానికి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు పాస్‌లు పంపిణీ చేయనున్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సీఎం వైయస్ జగన్ నెరవేర్చారన్నారు. విధానపరంగా పలు మార్పులు తీసుకొచ్చామన్నారు.