ఏలూరులో ఘనంగా వైయ‌స్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం 

28 Mar, 2026 15:33 IST

ఏలూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు వైయ‌స్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఏలూరు పట్టణంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పల్లి శ్రీనివాసు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాశ్ (జేపీ), రాష్ట్ర వైయ‌స్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరి గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కార్మిక సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు , కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.