సీతారామపురంలో వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం…
31 Mar, 2026 12:47 IST
పశ్చిమగోదావరి జిల్లా: జిల్లాలోని సీతారామపురం గ్రామంలో దుండగులు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహం చెయ్యిని విరగ్గొట్టడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన తెలిసిన వెంటనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.