జోహానెస్‌బర్గ్ మిడ్‌రాండ్‌లో ఘనంగా వైయస్ఆర్ జయంతి
తాడేపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జోహానెస్‌బర్గ్ మిడ్‌రాండ్‌లో ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై మహానేత పట్ల తమకున్న గౌరవాన్ని అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వైయస్ ఆర్ ప్రవేశపెట్టిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడినవారు అనేకమంది మహానేత సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా New Jerusalem Children’s Homeకు దాతృత్వం చూపించి, సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం వైయస్ఆర్ సేవలను స్మరించుకుంటూ కేక్ కట్ చేసి, సందడిగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విభాగం నాయకులు నరసింహ రెడ్డి కళ్ళా, సూర్య రామిరెడ్డి, శివ రాజవరపు, విక్రమ్ రెడ్డి పెట్లూరు, శ్రీకృష్ణ రెడ్డి గరిస, వాసు సింగారెడ్డి, మధు పల్లె, హరి ఆత్మకూరి, అంజలి, వెంకట్ మాగంటి, అంజి రెడ్డి సానికొమ్ము, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.