వైయస్ జగన్‌ను కలిసిన వైయస్ఆర్ జిల్లా నూతన జెడ్పీ చైర్మన్
10 Apr, 2025 16:06 IST
తాడేపల్లి: వైయస్ఆర్ జిల్లా నూతన జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన ముత్యాల రామగోవిందరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎంను కలిసిన రామగోవిందరెడ్డి తనకు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ జగన్‌ను కలిసిన వారిలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వి సతీష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి, పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు.