ఆత్మకూరులో ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
10 Dec, 2022 13:41 IST
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖోఖో జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కుమారుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శిల్పా కార్తీక్‌రెడ్డి ప్రారంభించారు. ఆత్మకూరు టౌన్‌లోని హైస్కూల్‌లో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన 42వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ప్రారంభించిన అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం క్రీడాకారులు చేపట్టిన భారీ ర్యాలీ కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ జగన్ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా ఖోఖో అసోసియేషన్ సభ్యులు, ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులు, ఇతర జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.