దేవుని దయ, ప్రజల దీవెనలతో 12వ ఏట అడుగుపెడుతున్నాం
12 Mar, 2022 12:18 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!`` అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.