నామినేషన్లు వేసిన వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు
22 Feb, 2023 12:59 IST
అనంతపురం: మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైయస్‌ఆర్ సీపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. అనంతపురం, కడప, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నామినేషన్ వేశారు. అదేవిధంగా అనంతపురం, కడప, కర్నూలు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి వైయస్‌ఆర్ సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైయస్‌ఆర్ సీపీ అభ్యర్థి మంగమ్మ నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషాశ్రీచరణ్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.