చంద్రబాబు ఎలాంటివ్యక్తో `మహా దోపిడీ` పుస్తకం చెబుతుంది
తాడేపల్లి: ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ఎలా దోచేశారో `మహా దోపిడీ` పుస్తకం క్లియర్‌గా చెబుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్టు విజయబాబు రచించిన `మహాదోపిడీ` పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టే 2019 టీడీపీని ఓడించారని గుర్తుచేశారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు విపరీతమైన దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని, అధికారం కోసం పవన్, బీజేపీని వాడుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు దోపిడీ గురించి మహా దోపిడీ పుస్తకంలో క్లియర్‌గా రాశారన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడే భాషను ప్రజలంతా గమనిస్తున్నారని, షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తోందన్నారు. దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు అని, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తన భార్యను కూడా వాడుకున్నారని కామెంట్స్ చేశారు.