మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాష్ట్రవ్యాప్తంగా జైత్రయాత్రగా సాగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత
పేర్కొన్నారు. గురువారం సునీత మీడియాతో మాట్లాడారు.
- 58 నెలలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుపరి పాలన జరిగింది. మా పాలనలో ఎక్కడ అవినీతి లేకుండా ఇంటి వద్దకే పథకాలు వచ్చేలా పాలన నడిచింది.
- ఇడుపుల పాయ నుండి ఇచ్చాపురం వరకు వైయస్ జగన్ కి ప్రజలు బ్రాహ్మరధం పట్టారు
- వైయస్ జగన్ పాలన చూసి ఓర్చుకోలేక చంద్రబాబు,పవన్ ఆరోపణలు చేస్తున్నారు.
- రాష్టంలో మళ్ళీ వైయస్ జగనే సీఎం అవ్వాలని పేదలందరూ భావిస్తున్నారు.
-రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ నాయకుల దాడులు జరుగుతున్నాయి.
- అభివృద్ధి, సంక్షేమం మాకు రెండుకళ్లు.ముఖ్యంగా పేదల అభివృద్ధి మాకు ముఖ్యం.
- రాష్టంలో ఎక్కడకి వెళ్లినా ప్రజలు ఆనందంగా ఉన్నారు.జగన్ గారికి బ్రహ్మరధం పడుతున్నారు.
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో మళ్ళీ గెలవబోతుంది.
- ప్రజావిశ్వాసం లేని లోకేష్ మంగళగిరిలో గెలిచే పరిస్దితి లేదు.
- చంద్రబాబు వైయస్ జగన్ గారి చేస్తున్న విమర్శలు ఆపాలి.
- చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పధకాలను ప్రజలు నమ్మడం లేదు.
- అందుకే వాటి ప్రచారం మరిచి జగన్ గారిపై దూషణలు,అనుచిత వ్యాఖ్యలు,వ్యక్తిగతంగా కించపరచడం చేస్తున్నారు.
- వైయస్ జగన్ పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల సమస్యలను పధకాల అమలు చేయడం ద్వారా తీర్చారు.
- పార్టీ మేనిఫెస్టోను తూచతప్పకుండా అమలు చేశారు.
- అందుకే ప్రజలు విశ్వసనీయత,నమ్మకానికి ప్రతీకగా జగన్ గారిని ప్రతీకగా భావిస్తున్నారు.
- తెలుగుదేశం కూటమి గెలవదనే ప్రస్టేషన్ లో చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ లు ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు.
- ఆ కూటమికి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయం.