అసెంబ్లీ నుంచి వైయ‌స్ఆర్ సీపీ వాకౌట్‌

22 Jul, 2024 11:51 IST

అసెంబ్లీ: ఆంధ్ర‌రాష్ట్రంలో హింసాత్మ‌క పాల‌న జ‌రుగుతోంద‌ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గ‌ళం విప్పింది. శాస‌న‌స‌భ సమావేశాలు మొదలైన నేప‌థ్యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న‌ల్ల కండువాలు ధ‌రించి సభకు హాజ‌ర‌య్యారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగ మొద‌లైన సమయంలోనూ 'హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ' నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగించ‌డంతో నిరసనగా వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.