వార్డు స్థాయి కమిటీలను త్వరగా పూర్తి చేయాలి
తిరుపతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ఎమ్మెల్సీ, జిల్లా టాస్క్ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీకి సంబంధించిన వార్డు స్థాయి కమిటీలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సూచించారు. పూర్తిస్థాయిలో కమిటీ నిర్మాణం చేపట్టి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి వార్డులో పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్య ఉండి సమస్యలపై పోరాడాలని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని నేతలు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, నగర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.