రూ.87 వేల కోట్ల ఖర్చుతో ఇళ్ల పట్టాల పంపిణీ
తిరుమల: రాష్ట్రంలోని పేద ప్రజల కోసం రూ.87 వేల కోట్ల ఖర్చుతో వైకుంఠ ఏకాదశి రోజు ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టారని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలోని పేద ప్రజలు కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో వైయస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెడన శాసనసభ్యుడు జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఆలయాలపై వరుస దాడులపై ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని, అయితే దానిపై ప్రతిపక్షాలు లేనిపోని హడావిడి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడి జరగకుండా ఉండేందకు ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటోందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.