క‌ష్ట‌ప‌డే వారికి పార్టీ పదవుల్లో సముచిత స్థానం  

23 Jan, 2026 15:50 IST

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: వైయ‌స్ఆర్‌సీపీ బ‌లోపేతం కోసం చిత్త‌శుద్ధితో క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే ప్ర‌తీఒక్క‌రికీ పార్టీ ప‌ద‌వుల్లో స‌ముచిత స్థానం ద‌క్కుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ తూర్పుగోదావ‌రి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.  రాజమండ్రి రూరల్ స్థానిక బొమ్మూరు తూర్పుగోదావరి జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గం కోఆర్డినేటర్, జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటు ఇంచార్జ్ గూడూరు శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి , మాజీ డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు  హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి సంస్థాగతంగా పార్టీ పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాల‌న్నారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా పార్టీ కోసం సమయం కేటాయించాల్సిన సందర్భం వచ్చిందని, పార్టీ పదవుల్లో ప్రతి ఒక్కరికి సమచితస్థానం కల్పిస్తామని ప్రతి వర్గానికి కులానికి కూడా స్థానం కల్పించి మరింత బలోపేతం చేయడానికి క్రింది స్థాయి వరకు అడుగులు వేస్తున్నామని వైయ‌స్ జ‌గ‌న్‌ లక్ష్యం భారతదేశంలోనే అతి ప్రటిష్టమైన పార్టీగా వైయ‌స్ఆర్‌సీపీని బలోపేతం చేయాలన్న సూచనతో మనం అందరం అడుగులు వేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వానికి బీటలు వచ్చాయని రానున్నది జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవ‌డ‌మే లక్ష్యంగా మనందరం ముందుకు సాగాలని అన్నారు.

 జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లో వచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మేమందరం ఎంత కృషి చేస్తున్నమో మాతోపాటు మీరందరు కూడా శ్రమించి పార్టీని ప్రజలకు మరింత చెరువు చేయాలని, 2029 ఎన్నికల లక్ష్యంగా ఈ రోజు నుంచి వ్యూహంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ తమవంతుగా మన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు హామీల అమల్లో వైఫల్యం చెందిందని అన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గొందేసి శ్రీనివాసరెడ్డి,నక్కరాజబాబు,గిరజాల బాబు,నక్క నగేష్,పార్టీ నాయకులు యాదాల స్టాలిన్,వెలుగుబంటి అచ్యుతరామ్,అంగాడ సత్యప్రియ,చికిరుమిల్లి చిన్నా,రాజమౌళి,తాటికొండ  త‌దిత‌రులు పాల్గొన్నారు.