టీటీడీపై జీఎస్టీ రద్దు చేయాలి
3 Aug, 2022 14:30 IST
న్యూఢిల్లీ: టీటీడీపై జీఎస్టీ రద్దు చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ డిమాండు చేశారు. లోక్‌సభలో బుధవారం మార్గాని భరత్ మాట్లాడారు. దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, పేద, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మానవతా దృక్పథంతో ఆదుకోవాలి: ఎంపీ వంగా గీత
ప్యాకేజీ ఫుడ్స్‌పై జీఎస్టీ వేయడం దారుణమని ఎంపీ వంగా గీత అన్నారు. మానవతా దృక్పథంతో ప్రజలను ప్రధాని ఆదుకోవాలని ఎంపీ కోరారు.