బెలుగుప్పలో  `వైయ‌స్ఆర్ ఆసరా' సంబరాలు

8 Oct, 2021 12:52 IST

అనంతపురం : ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్పలో శుక్రవారం `వైయ‌స్సార్ ఆసరా వారోత్సవాల' సంబరాలు ఘనంగా  జరిగాయి. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చిత్రపటానికి మహిళలతో కలిసి ఆయన పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం 775 స్వయం సహాయక సంఘాలకు 5 కోట్ల 42 లక్షల 79 వేల 148 రూపాయల మెగా చెక్కును మహిళలకు ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో తదితర గ్రామాల మహిళలు, వైయ‌స్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.