ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఆమోదం
4 Sep, 2019 12:49 IST
అమరావతి: ఆర్టీసీ విలీనానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం ఈరోజు ఉదయం సమావేశమయింది. వైయస్‌ఆర్ పెళ్లి కానుకకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెల శ్రీరామనవమి నుంచి ఈ పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెళ్లి కానుక కింద రూ.1 లక్ష చెల్లింపునకు కేబినెట్ తీర్మానించింది. ఆశా వర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి 10 వేలకు పెంచారు.