వైయస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం
2 Sep, 2019 11:20 IST
పులివెందుల: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దివంగత వైయస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం సీఎం వైయస్ జగన్ భాకరాపురం చేరుకున్నారు. భాకరాపురంలో ఏర్పాటు చేసిన వైయస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆయన సోదరి విమలమ్మ, కూతురు సునీతతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వైయస్ వివేకానందరెడ్డి విగ్రహానికి సీఎం వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైయస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.