నా తండ్రి హత్యకేసును నిష్ఫక్షపాతంగా విచారించాలి
21 Mar, 2019 14:08 IST
విజయవాడ: సిట్ విచారణను తప్పుదోవ పట్టించేలా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని ఏపీ ప్రధాన ఎన్నికల అ«ధికారి ద్వివేదికి వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు సిట్ అధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారించి అసలు దోషులకు శిక్ష పడేలా చేయాలని సునీత విజ్ఞప్తి చేశారు.