వైయస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి
16 Mar, 2019 11:39 IST
పులివెందుల: మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. పులివెందులలోని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైయస్ రాజారెడ్డి ఘాట్‌లో వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు వివేకానందరెడ్డి ఇంటి నుంచి రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ వైయస్ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ‘అజాత శత్రువు’ను కడసారి చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.