వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం
19 Aug, 2019 11:32 IST
గుంటూరు : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని కాకుమానులో చోటుచేసుకుంది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైయస్ఆర్సీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.