నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
4 Mar, 2026 16:13 IST
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖ దక్షిణ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసాన్ని సందర్శించారు.
విశాఖ రాణాప్రతాప్ నగర్‌లోని ఆయన నివాసంలో ఇటీవల వివాహం జరిగిన వాసుపల్లి గణేష్ రెండో కుమారుడు వాసుపల్లి సాకేత్, శ్రావణిలకు వైయస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నూతన వధూవరులతో ఫోటోలు దిగిన వైయస్ జగన్, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. విశాఖకు వచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
