పేరం స్వర్ణలతకు వైయస్ జగన్ పరామర్శ
23 Aug, 2025 11:46 IST
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలతను ఫోన్‌లో పరామర్శించారు. స్వర్ణలత అనారోగ్యంతో బాధపడుతుండటంతో విషయం తెలుసుకున్న వైయస్ జగన్..ఇవాళ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.