అధైర్యపడొద్దు..అండగా ఉంటాం
9 May, 2025 14:26 IST
శ్రీ సత్యసాయి జిల్లా: ఆపరేషన్ సింధూర్ భాగంగా దేశ రక్షణ కోసం ఉగ్రదాడిలో పోరాడి అమరుడైన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. మీ బిడ్డ దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందాడని, ఆయన త్యాగాన్ని దేశం మరువదన్నారు. మీకు తాను, మా పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.