ఈద్ ముబారక్
29 Mar, 2025 18:15 IST
తాడేపల్లి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ(సోమవారం) సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ఆయన అన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైయస్ జగన్ తన సందేశంలో తెలిపారు.