వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే రాజధాని నిర్మాణం..

27 Feb, 2019 13:18 IST

అమరావతి: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వస్తే రాజధానిని తరలిస్తారని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్‌ మండిపడ్డారు.అమరావతి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ చెప్పిన మాట ప్రకారం చిత్తశుద్ధితో నూతనంగా సొంత గృహాన్ని,వైయస్‌ఆర్‌సీసీ శాశ్వత కేంద్ర కార్యాలయాన్ని నిర్మించారన్నారు. కట్టుబట్టలతో వచ్చేశాను..బస్సులో పడుకున్నాను అని చెప్పే చంద్రబాబు..ఐదేళ్ల నుంచి ఇంటి నిర్మాణం  ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించారు.చిత్తశుద్ధితో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నారు కాబట్టే..అమరావతిలో సొంత ఇల్లు,వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం భవనం నిర్మించారన్నారు.రాజధాని నిర్మాణం వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే జరుగుతుందన్నారు. 

రాష్ట్రమంతా పండుగ వాతావరణం

రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జగన్‌ అమరావతిలో గృహ ప్రవేశం చేయడంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని వైయస్‌ఆర్‌ సీపీ నేత రవీంద్రబాబు అన్నారు. గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ప్రజల హృదయాల్లో ఎప్పుడో స్థావరం ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పోరాటాలు చేస్తున్న వైయస్‌ జగన్‌ ప్రజల మన్నలను పొందుతున్నారన్నారు. ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ మా సొంత పార్టీ, తాడేపల్లిలోని వైయస్‌ జగన్‌ నివాసం మా సొంత ఇల్లు, జననేత మా సొంత మనిషి అని భావిస్తున్నారన్నారు.