రేపు విశాఖకు వైయస్ జగన్

9 Jun, 2026 14:07 IST

తాడేప‌ల్లి: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలను శ్రీ వైయస్ జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు.

ఈ ఘటనకు సంబంధించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నాయకుల ద్వారా తెలుసుకుంటున్న శ్రీ వైయస్ జగన్, రేపు (10.06.2026) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.