రేపు వినుకొండలో వైయస్ జగన్ పర్యటన
తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం వినుకొండలో పర్యటించనున్నారు. టీడీపీ కార్యకర్త చేతిలో దారుణహత్యకు గురైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు.
వైయస్ఆర్‌సీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న రషీద్‌ను, టీడీపీకి చెందిన జిలానీ, బుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డు మీద దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే.
బెంగళూరులో ఉన్న వైయస్ జగన్, ఈ ఘటన గురించి తెలియగానే, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. హత్య ఘటన, వినుకొండలో పరిస్థితిని ఆయన ఆరా తీశారు. స్థానిక పార్టీ నాయకులంతా.. వెంటనే రషీద్ కుటుంబ సభ్యులను కలవాలని, వారికి ధైర్యాన్నిచ్చి, తోడుగా నిలవాలని నిర్దేశించారు.
మరోవైపు పల్నాడు జిల్లాకు చెందిన పలువురు వైయస్ఆర్‌సీపీ నేతలు, నాయకులు, వినుకొండ వెళ్లి, రషీద్‌కు నివాళులర్పించి, ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు.