లండన్ పర్యటనకు వైయస్ జగన్
14 Jan, 2025 18:26 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు బయల్దేరివెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి పట్టా ప్రదానోత్సవానికి వైయస్.జగన్ దంపతులు హాజరుకానున్నారు. వైయస్ జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచప్రఖ్యాత కింగ్స్ కాలేజీ లండన్‌లో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సును పూర్తిచేసి, చక్కటి ప్రతిభతో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈనెల 16న కింగ్స్‌కాలేజ్, లండన్‌లో ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో వైయస్.జగన్ దంపతులు పాల్గోనున్నారు. ఈ నెలాఖరున వైయస్ జగన్ లండన్ నుంచి తిరిగి ప్రయాణం అవుతారు.