కనకదుర్గమ్మను దర్శించుకున్న వైయస్ జగన్
విజయవాడ: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వైయస్ జగన్‌కు ఆలయ అధికారులు, పురోహితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి వైయస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వైయస్ జగన్‌కు పురోహితులు తలపాగ కట్టి తీర్థప్రసాదాలు అందజేశారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైయస్ జగన్ ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని, అక్కడి నుంచి కడపలోని అమీన్‌పీర్ దర్గాలో చాందర్ సమర్పించారు. అలాగే పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని దైవజనుల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్‌లో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సమాది వద్ద నివాళులర్పించి ఆశీస్సులు పొందారు.