రేపు జోగి రమేష్ కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
5 Feb, 2026 18:21 IST
తాడేపల్లి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీమంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 6న పరామర్శించనున్నారు. ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు. కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.