ఆదర్శప్రాయుడు శ్రీరాముడు 

27 Mar, 2026 10:39 IST

 తాడేపల్లి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి.. వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.