తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు ఓబన్న

11 Jan, 2026 17:56 IST

తాడేపల్లి: ఓబన్న జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్‌ సామ్రాజ్యానికే సవాల్‌ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.