ఆసియా ట్రోఫీలో భారత హాకీ జట్టు విజయం అద్భుతం
18 Sep, 2024 10:05 IST
తాడేపల్లి: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు గెలుపుపై వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌జగన్ హర్షం వ్యక్తం చేశారు. ట్రోఫీ ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో భారత జట్టు సాధించిన విజయం అద్భుతం అని వైయస్ జగన్ కొనియాడారు. ఈమేరకు తన ఎక్స్(ట్విటర్)లో వైయస్ జగన్ ఒక పోస్టు చేశారు. భారత హాకీ జట్టుసభ్యులకు అభినందనలు తెలిపారు.