శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి
29 Mar, 2025 19:17 IST
తాడేపల్లి: శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. శ్రీ గంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల సందర్భంగా భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం గుండంచర్లలో తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.