నేతాజీ చూపిన పోరాట మార్గం నేటికీ ఆదర్శనీయం
23 Jan, 2026 11:26 IST
తాడేపల్లి: స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన పోరాట మార్గం నేటికీ ఆదర్శనీయమని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ నేతాజీ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
ఎక్స్ వేదికగా వైయస్ జగన్..
స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. దేశభక్తి, ధైర్యం, పోరాట పటిమ, క్రమశిక్షణే ఆయన జీవన విధానం. నేతాజీ చూపిన పోరాట మార్గం నేటికీ ఆదర్శనీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.