మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు
15 Dec, 2024 10:33 IST
తాడేపల్లి: ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఈ మేరకు వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
వైయస్ జగన్ ట్విట్టర్ వేదికగా..
‘ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టిరాములుగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.