పులివెందుల చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

24 Feb, 2026 17:17 IST

వైయ‌స్ఆర్ జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల చేరుకున్నారు. రెండు రోజుల  పర్యటనలో భాగంగా ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 24వ తేదీ) వైయ‌స్‌ జగన్‌ పులివెందులకు వ‌చ్చారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు.  పులివెందులలోని భాకరా­పురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
YS Jagan Tours Pulivendula YSR District

25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యా­హ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.