వైయస్ జగన్ చేతుల మీదుగా బాలుడికి అక్షరాభ్యాసం
తాడేపల్లి : తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బాలుడికి అక్షరాభ్యాసం చేయించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని వారు వైయస్ జగన్‌ను కోరారు. తల్లిదండ్రుల కోరిక మేరకు లెనిన్ వివేక్ కుమారుడు భార్గవ్ ప్రకాష్‌కు వైయస్ జగన్ స్వయంగా అక్షరాభ్యాసం చేసి ఆశీస్సులు అందజేశారు. చిన్నారి భవిష్యత్తు విద్యాభ్యాసంలో రాణించాలని ఆకాంక్షిస్తూ వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
తమ కుమారుడికి వైయస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరగడం పట్ల లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తమ కుమార్తెకు కూడా వైయస్ జగన్ అన్నప్రాసన నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబానికి వైయస్ జగన్ చూపుతున్న ప్రేమ, ఆదరణకు వారు కృతజ్ఞతలు తెలిపారు.